Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీతీశ్‌కుమార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తన ప్రాణం ఉన్నంతకాలం బీజేపీతో మళ్లీ పొత్తుపెట్టుకోబోనని బిహార్ ముఖ్యమంత్రి నీతీష్‌కుమార్ స్పష్టం చేశారు. అధికారం కోసం కూటములు మారుస్తారంటూ తనపై బీజేపీ చేస్తున్న విమర్శల సమయంలో తాను బతికిఉన్నంత వరకూ బీజేపీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలను బీజేపీ వినియోగించుకుంటున్నదని విమర్శించారు. ఉత్తర బిహార్‌లోని ఓ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ''లాలూపై కేసులు నమోదు చేయడంతో వారితో సంబంధాలు తెంచుకున్నాను..కానీ ఇప్పుడు మేం మళ్లీ కలిసిపోయిన నేపథ్యంలో వాళ్లు కొత్తగా కేసులు పెడుతున్నారు. వారితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు' అని బీజేపీ పేరును ప్రస్తావించకుండా నీతీశ్‌కుమార్ మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే పార్టీకి చెందిన నేతలు భిన్నవిధాలుగా ఉన్నారన్నాన్న ఆయన, మాజీ ప్రధాని వాజ్‌పేయీ, ఎల్‌కె ఆద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితర నేతలను సైతం ప్రస్తుతం అధకారంలో ఉన్నవారూ మాత్రం పట్టించుకోరని చెప్పారు. వారికి ఎవరూ కనిపించరు..ఎవరికీ గౌరవం ఇవ్వరూ అంటూ బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేశారు.