Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెగ్యులర్ స్టాఫ్ నర్సులతో పోస్టుల భర్తీ తర్వాత కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న నర్సులను ఎందుకు తొలగించలేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎనిమిది జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు వారం రోజుల్లోగా తీసుకున్న చర్యల వివరాలు పంపించాలని ఆదేశించారు. రెగ్యులర్ నియామకాలు జరిగేంత వరకు అనే షరతు మేరకు మాత్రమే తీసుకున్న వారిని ఇప్పటికీ తొలగించకపోవడానికిి కారణమేంటో తెలపాలని కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల అధికారులను ఆదేశించారు.