Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. మొత్తం 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్స్ దాఖలు చేశారు. 47మంది అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. 83 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపినట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 17న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది.