Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకలను ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ఐవోఎఫ్ఎస్, వాణిజ్య పన్నుల శాఖ మాజీ అడిషనల్ కమిషనర్, ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి సలహాదారులు, చీఫ్ గార్డినర్ వై సత్యనారాయణ వెబినార్‌లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ జనార్ధన్ దండు, ప్రిన్సిపల్ కె సురేందర్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్ కుమార్, కార్యాలయ సిబ్బంది కోట మురళీకృష్ణ, టి రాజా పాల్గొన్నారు.