Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఉప ఎన్నిక బాధ్యులతో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమనీ, ఎన్నికల సమయంలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండవద్దని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తలు, గ్రామస్థాయి నా యకులు చాలా బాగా పని చేస్తున్నారని కొనియాడారు. అయితే బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు అడ్డగోలుగా కొనుగోళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి తరుణంలో క్యాడర్ మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆ రెండు పార్టీల అక్రమాలను, అవినీతిని అడ్డుకునేందుకు గ్రామాల్లో సిద్ధంగా ఉండాలని చెప్పారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సాయంత్రం జూమ్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా పోరాటం చేస్తున్నదని చెప్పారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ సందర్భంగా జరిగిన సభను జయప్రదం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈనెల 17 నుంచి 20 వరకు తాను నియోజకవర్గంలోనే ఉండి గ్రామ గ్రామానా ప్రచారంలో పాల్గొంటానన్నారు. ఈనెల 31న ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్క రించుకుని హైదరబాద్‌లో భారత్ జోడో భారీ ప్రదర్శన నిర్వహిస్తామ న్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రచార బాధ్యతల్లో ఉన్నవారెవరూ నియోజక వర్గాన్ని విడిచిపెట్టొద్దని కోరారు. మునుగోడు ఎన్నికల్లో పని చేసిన నాయకులు భారత్ జోడో యాత్రలో ప్రత్యేకంగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆర్. దామోదర్‌రెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, షబ్బీర్ అలీ, మల్లురవి, సంపత్‌కుమార్, శంకర్ నాయక్, అనిల్ రెడ్డి, చెరుకు సుధాకర్ తదితరులు మాట్లాడారు.