Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయంలో అక్రమ నియామకాలు జరిగాయంటూ మెడికల్ జేఏసీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎంఈ కార్యాలయంలో అడిషనల్ డీఎంఈ క్యాడర్లో ఉన్న వారిని నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా ఉందని తెలిపారు. వాటిని డీఎంఈ బేఖాతరు చేస్తూ తనకు అనుకూలంగా ఉండే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకున్నారని ఆరోపించారు.