Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాత పెన్షన్ సాధన కొరకు ఈ నెల తొమ్మిది నుంచి కాశ్మీర్ లాల్‌చౌక్ నుంచి బయల్దేరిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ), నప్రూఫ్ (ఎన్ఒపీఆర్యుఎఫ్) సంయుక్తాధ్వర్యంలో చేస్తున్న సడక్ యాత్ర సోమవారం హైదరాబాద్ చేరుకోనున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను చైతన్యం చేస్తున్న ఈ యాత్ర జమ్మూ, జలంధర్(పంజాబ్), చండీగఢ్,సహరాన్పూర్ (ఉత్తరప్రదేశ్), డెహ్రాడూన్, హరిద్వార్ (ఉత్తరాఖండ్),ముజఫర్ నగర్, మీరట్ (ఉత్తరప్రదేశ్), ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్ (మధ్యప్రదేశ్), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బేతుల్ (మధ్యప్రదేశ్), నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా సాగుతున్నది. నేటి ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోనున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో టీఈఏ రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్ కుమార్ స్వామి మాట్లాడుతూ, అమరవీరుల స్థూపం వద్ద జరిగే కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయనీ, తెలంగాణ కూడా సీపీఎస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న వారిలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ శ్రీమతి జి.నిర్మల, ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఆదిత్య పాల్గొన్నారు.