Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు కే తారకరామారావు, టీ హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్, జీ జగదీశ్‌రెడ్డి, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ హామీ ఇచ్చినందున మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్లు వేయాలనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి తెలిపారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హైదరాబాద్‌కు రాగానే ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని మంత్రులు చెప్పారని వివరించారు. ఆదివారం చౌటుప్పల్‌లో జరిగిన సమాఖ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన ఎస్వీ రెడ్డి అనే వ్యక్తికీ, తమ సమాఖ్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో గ్రామాల వారిగా సర్వీసులో ఉన్నవారు, రిటైర్ ఆయిన వారి జాబితాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సమాఖ్యపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సమాఖ్య ముఖ్య సలహదారు బీజేఎమ్ రెడ్డి, కన్వీనర్ ఎమ్వీ చారి తదితరులు పాల్గొన్నారు.