Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ యజమానుల సంఘాలు :సమస్యలపై సీఎస్‌తో భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు లారీ యజమానుల సంఘాలు ప్రకటించాయి. ఆదివారం మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బీ నందారెడ్డి, ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాసరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. గతంలో మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యి, చర్చించిన విషయాలను తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి సోమేష్‌కుమార్, శ్రీనివాసరాజు అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నికలు ముగియగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్యలు ఫలప్రదంగా జరిగాయనీ, అందువల్ల మునుగోడులో తాము టీఆర్ఎస్ అభ్యర్థిని బలపరుస్తూ సోమవారం నుంచి ప్రచారం నిర్వహిస్తామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు.