Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎస్టీయూ టీఎస్ తరపున జి.భుజంగరావు బరిలో దిగనున్నారు. ఆదివార ం హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా ప్రతిపాదించి, బలపరిచి అభ్యర్థిగా ప్రకటించి నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందం గౌడ్, యం.పర్వత్ రెడ్డిలు తెలిపారు. భుజంగరావు హైదరాబాద్ జిల్లాలో 16 ఏండ్లపాటు మండల, జిల్లాస్థాయి అధ్యక్ష బాధ్యతల్లో పని చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీయూ అధ్యక్షునిగా, తెలంగాణలో సైతం ఆరేండ్లపాటు అధ్యక్షునిగా అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యమ నేతగా, ప్రశ్నించే గొంతుకగా అందరికి సుపరిచితులని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం నియామకాల్లేక, పదోన్నతులు రాక, బదిలీలు లేక, 317 జీవో బాధితులకు న్యాయం జరగక సమస్యల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని చెప్పారు. అయినప్పటికీ చట్టసభల్లో ప్రశ్నించే గొంతులు కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఉపాధ్యాయ, ఉద్యమ నేతగా, ప్రశ్నించే గొంతుగా తగిన గుర్తింపు కలిగిన అభ్యర్థిగా భుజంగరావును తమ అభ్యర్థిగా నిలుపుతున్నామని వివరించారు. తమ అభ్యర్థిగా అన్ని సంఘా లు తోడ్పాటునందించాలనీ, ప్రశ్నించే గొంతుని కాపాడుకోవాలని కోరారు.