Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరబాద్‌బ్యూరో
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక విమానంలో ఆదివారం హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఒడిశాలో త్వరలో 'మేక్ ఇన్ ఒడిశా' కాన్క్లేవ్ మూడో ఎడిషన్ నిర్వహణకు సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ప్రతినిధులతో నవీన్‌పట్నాయక్ బృందం సమావేశం కానుంది. రెండ్రోజులపాటు ఆయన రాష్ట్రంలోనే ఉండి, పెట్టుబడిదారులతో సమావేశమై చర్చలు జరుపుతారు.