Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఉప ఎన్నిక తనిఖీల్లో రూ.కోటీ స్వాధీనం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు సంచులు నియోజకవర్గానికి ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు వాహనం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి టాటా సఫారీ వాహనం (టీఎస్ 02ఎఫ్హెచ్ 2425) అనుమానంగా అనిపించడంతో తనిఖీ చేయగా.. రూ.కోటి లభించాయి. ఈ వాహనం ఆ జిల్లాకు చెందిన ఓ కౌన్సిలర్ భర్త వేణుకు సంబంధించినదిగా పోలీసు అధికారులు గుర్తించారు. లభించిన డబ్బును బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము వద్ద నుంచి తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారికి పోలీసులు సమాచారం ఇచ్చారు. కాగా, ఇప్పటికే డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి విజయం సాధించాలనే పట్టుతోనే బీజేపీ నేతలున్నారు. మునుగోడు ఎన్నికల ఇన్చార్జి వివేక్ వెంకటస్వామి తన కంపెనీ ఖాతాలో నుంచి ఈటల రాజేందర్ కంపెనీ ఖాతాలోకి నేరుగా సుమారు రూ.25కోట్లు బదిలీ చేసినట్టు తెలిసింది. వాటిని కూడా ఈ ఎన్నికల్లో వాడుకునేందుకే పరోక్షంగా సహకారం అందించినట్టు తెలుస్తోంది.