Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ విధానాన్ని మోడీ సర్కారు రద్దు చేయాలి
- ఎన్‌ఓపీఆర్‌యూఎఫ్ నేతలు బిపి రావత్, సంపత్ డిమాండ్
- సడక్ యాత్రకు గన్‌పార్క్ వద్ద స్వాగతం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకే దేశం ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభు త్వాన్ని జాతీయ పాత పెన్షన్ సాధన అసోసియేషన్ (ఎన్ వోపీఆర్యూఎఫ్) అధ్యక్షుడు బిపి రావత్, జాతీయ సలహా దారులు చిలగాని సంపత్‌కుమారస్వామి డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పాతపెన్షన్ సాధన కోసం ఈనెల తొమ్మిది నుంచి కాశ్మీర్‌లోని లాల్‌చౌక్ నుంచి కన్యాకుమారి వివేకానంద విగ్రహం వరకు ఎన్‌ఓపీఆర్‌యూఎఫ్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన సడక్ యాత్ర సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నది. ఈ యాత్రకు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు గన్‌పార్క్ వద్ద ఘనస్వాగతం పలికారు. తెలంగాణా అమర వీరుల స్తూపం వద్ద అమర వీరులకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్వోపీఆర్‌యూఎఫ్ జాతీయ సలహాదారులు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమారస్వామి మాట్లాడుతూ ఇప్పటికే మూడు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల బంధు కావాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఎన్వోపీఆర్‌యూఎఫ్ జాతీయ అధ్యక్షుడు బిపి రావత్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ పాత పెన్షన్ విధానం అమలుకు కట్టుబడాలన్నారు. ఎవరైతే పాత పెన్షన్ అమలుకు నిర్ణయం తీసుకుంటారో వారికే దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ జి నిర్మల, వినోద్ కనోజియా, ప్రధాన కార్యదర్శులు, సిహెచ్ ఆదిత్య, జాజుల రంజిత్, రాష్ట్ర కోశాధికారి గడ్డం బాలస్వామి, రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్లు ఆనంద్, వేముల రాధిక, సురేందర్‌రెడ్డి, హరాలే సుధాకర్‌రావు, భరత్ సత్యనారాయణ, లక్ష్మణాచారి, రాష్ట్ర కన్వీనర్ దోనేపుడి చక్రపాణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పొన్నగంటి ఆంజనేయులు, రాష్ట్ర సహాధ్యక్షుడు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.