Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్
- శంషాబాద్లో ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ విమర్శించారు. సోమవారం ఆశా వర్కర్ల తెలంగాణ రాష్ట్ర మహాసభలు శంషాబాద్ పరిధిలోని దండుపల్లి ఎమ్మెస్ గార్డెన్లో నిర్వహించారు. ఈ మహాసభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జె వెంకటేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పారితోషికం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని చెప్పారు. చాలీచాలని వేతనాలతో జీవితాలు గడపలేక సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు బాగా పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను వారి ప్రాణానికి తెగించి కాపాడారంటూ పాలకులు పెద్దగా పొగిడారని అన్నారు. కానీ వారికే భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. నెలకు రూ.26 వేల వేతనం ఉంటేనే ఒక కుటుంబం బతుకుతుందని చెప్పారు. బతుకుతున్నారు. ఆశా వర్కర్లకు వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్తోపాటు వారికి ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, అధ్యక్షులు ఎన్ రాజు, కోశాధికారి కవిత, నాయకులు సాయిబాబా, రుద్రకుమార్, జగదీష్, రామ్మోహన్, నర్సిరెడ్డి, దేవేందర్, స్వప్న, మల్లేష్, ఆశా వర్కర్ల సంఘం జిల్లా నాయకులు సునీత, సునంద, నవనీత, రాధిక తదితరులు పాల్గొన్నారు.