Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గుర్తు'లపై హైకోర్టులో నేడు విచారణ
- పిటిషన్ వేసిన టీఆర్ఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు తరహాలో ఉన్న గుర్తులను మును గోడు ఉప ఎన్నికల్లో ఇతర అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీకి ఉత్తర్వులివ్వాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కెమెరా, చపాతీ రోలర్, డోలి, రోడ్ రోలర్, సోప్ బాక్స్, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను కేటాయించకుండా ఆదేశాలివ్వాలని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ భరత్ కుమార్ అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేయాలన్న వినతిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ నిరాకరించింది. మంగళవారం విచారణ చేస్తామని చెప్పింది. ఈ మేరకు ఈసీకి వనతిపత్రం ఇచ్చామనీ, ఈనెల పదిన ఇచ్చిన వినతి పత్రంపై స్పందించలేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అవకాశాలున్న ందున తక్షణమే విచారణ చేయాలని కోరారు. ఇందుకు బెంచ్ నిరా కరించింది. రోడ్డురోలర్, టెలివిజన్, కెమెరా వంటి గుర్తులకు 2018లో పెద్ద సంఖ్యలో ఓట్లు పోలయ్యాయనీ, ఆ మూడింటినే కాకుండా మిగిలిన ఐదు గుర్తులనూ వాడకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని కోరింది. 2018లో సీపీఐ, సీపీఎం, బీజేపీ, బీఎస్పీల కంటే ఆ గుర్తులతో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపింది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలంటే ఎనిమిది గుర్తులను రద్దు చేయాలనీ, ఈ మేరకు ఈసీకి ఆదేశాలివ్వాలని కోరింది. ఈ రిట్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.