Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో కోట్ల రూపాయలతో ప్రచారం, ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక గ్రామంలో ఓట్ల కోసం రూ.12 లక్షలిస్తానని చెప్పి రూ.రెండు లక్షలు మాత్రమే ఇవ్వడంతో మంత్రి మల్లారెడ్డిని అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ ముఠాలు కోట్ల రూపాయలతో మునుగోడులో దిగాయని చెప్పారు. వెల కట్టలేని విలువ ఓటుకుందనీ, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అమ్ముడుపోని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని విమర్శించారు.టీపీసీసీ మాజీ అధ్యక్షులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో, రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో ధనబలం చూపించి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు.