Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యుక్త వయస్కుల సమస్యల పరిష్కారం కోసం సమ్మిళిత కార్యాచరణ రూపకల్పనకు యునిసెఫ్, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) పూనుకున్నాయి. ఈ మేరకు సోమవారం రాజేంద్రనగర్లో నిర్వహించిన వర్క్ షాప్లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు తాము అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కౌమార సాధికారతపై ఐఈసీ ప్యాకేజీని కూడా సోమేశ్ కుమార్ విడుదల చేశారు. జనాభాలో 19 శాతం మంది (దాదాపు 9 మిలియన్లు) కౌమారదశ సమస్యలతో బాధపడుతున్నారనీ, ఇప్పటికీ బాలికల్లో రక్తహీనత, బాల్య వివాహాల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జెండర్ స్టడీస్, యునిసెఫ్ టీమ్ చైర్పర్సన్ జ్ఞానముద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య తదితరులు పాల్గొన్నారు.