Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రెడిట్స్‌ను తగ్గించిన జేఎన్టీయూ హైదరాబాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. క్రెడిట్స్‌ను తగ్గిస్తున్నట్టు జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు క్రెడిట్లను తగ్గిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ కావడానికి 37 క్రెడిట్లలో తొమ్మిది సాధిస్తే సరిపోతుందని వివరించారు. ఇక ద్వితీయ సంవత్సరం నుంచి మూడో ఏడాదికి ప్రమోట్ అయ్యేందుకు 79లో 19 క్రెడిట్లు సాధించాలని పేర్కొన్నారు. మూడో ఏడాది నుంచి నాలుగు సంవత్సరానికి ప్రమోట్ కావాలంటే 123లో 30 క్రెడిట్లు సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదికి వెళ్లాలంటే 42లో పది క్రెడిట్లను సాధించాలని వివరించారు. మూడు నుంచి నాలుగో ఏడాదికి ప్రమోట్ కావడానికి 86లో 21 క్రెడిట్లు పొందాలని తెలిపారు. ఒకవేళ విద్యార్థులు ఆ క్రెడిట్లు సాధించకపోతే మరుసటి ఏడాదికి ప్రవేశించే అవకాశం ఉండబోదనీ, అంటే డిటెన్షన్ అవుతారని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో క్రెడిట్లను తగ్గించామని తెలిపారు. బీఫార్మసీ రెగ్యులర్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ కావాలంటే 48లో 12 క్రెడిట్లు సాధించాలని పేర్కొన్నారు. రెండో ఏడాది నుంచి మూడో సంవత్సరానికి వెళ్లడానికి 96లో 24 క్రెడిట్లు, మూడో ఏడాది నుంచి నాలుగో ఏడాదికి వెళ్లేందుకు 144లో 36 క్రెడిట్లు పొందాలని సూచించారు. ఈ అవకాశం 2021-22 విద్యాసంవత్సరంలో చదివిన విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం 2022-23కు ప్రమోట్ కావడం కోసమే వర్తిస్తుందని వివరించారు.