Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్‌లో 44వ ఆల్ ఇండియా మహిళల రైల్వే కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) అధ్యక్షులు జేకే జైన్ ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్ లీగ్-కమ్-నాకౌట్ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామనీ, అక్టోబర్ 17 నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో 8 జట్లు పాల్గొంటున్నట్టు తెలిపారు.