Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీలోకి త్వరలో ఓ మాజీ మంత్రి చేరబోతున్నారనీ, అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడి యా ప్రతినిధులతో మాట్లాడారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలు స్తారనీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లది డూప్‌ఫైట్ మాత్రమేనని చెప్పారు. మును గోడును ఇన్నిరోజులు ఎందుకు దత్తతతీసుకోలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా వల్లనే గట్టుప్పల మండలం వచ్చిందనీ, చర్లగూడెం నిర్వాసితులకు డబ్బులు పడ్డాయని తెలిపారు.