Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నగరంలోని ప్రముఖ బంగారు నగల వ్యాపారి ముసద్దిలాల్ జ్యువెలర్స్ కార్యాలయంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో పెద్దనోట్ల రద్దు జరిగిన సమయంలో ముసద్దిలాల్ జ్యువెలర్స్ యాజమాన్యం భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన నగర నేర పరిశోధక విభాగం కోట్లలో నోట్ల మార్పిడికి సంబంధించిన అక్రమాలకు ముసద్దిలాల్ జ్యువెలర్స్ పాల్పడినట్టు కేసు నమోదు చేసింది. తదుపరిగా ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ముసద్దిలాల్ జ్యువెలర్స్ కార్యాలయంతో పాటు యజమానుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు సమాచారం.