Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 80.66 కోట్ల విలువైన ఆస్థులు జప్తు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : టీఆర్ఎస్ లోక్సభ ఎంపీ నామా నాగేశ్వర్రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆయనకు చెందిన రూ. 80.66 కోట్ల విలువైన ఆస్థులను ఈడీ అధికారులు జప్తు చేశారు. గతంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ హైవే నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును నామాకు చెందిన మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. దీనికి సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలనూ పొందింది. బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల రూపాయల రుణాలను దారి మళ్లించి మధుకాన్ కంపెనీ మోసానికి పాల్పడినట్టు ఈడీ దృష్టికి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ నామాకు చెందిన ఆస్థులపై గతంలో దాడులు నిర్వహించింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధుకాన్ కంపెనీకి చెందిన రూ. 80.66 కోట్ల విలువైన ఆస్థులను ఈడీ జప్తు చేసింది. త్వరలో మరికొన్ని ఆస్థులను కూడా స్వాధీనపర్చుకోవటానికి ఈడీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.