Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యామ్ 18 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,66,310 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,11,926 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588.90 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతానికి 308.7614 టీఎంసీలు ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 32,927 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 3972 క్యూసెక్కులు, కుడి కాల్వకు 8067 ఎస్ఎల్బీసీ ద్వారా 600 క్యూ సెక్కులు, లోలేవల్ కెనాల్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ నుంచి మొత్తం 3,11,926 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.