Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు/బయ్యారం/కురవి
మానుకోట జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కురవి మండలం జగ్యాతండాకు చెందిన రైతు భూక్య హుస్సేన్ (42) మిరపతోటలో నాగలి దున్నుతున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడటంతో పంటచేనులోనే అక్కడికక్కడే మృతిచెందాడు. బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామంలో పశువుల కాపరి మెస్సు కిరణ్ (24) పెద్దచెరువు కట్టపై
పశువులు మేపుతుండగా.. పిడుగుపడి కిరణ్ అక్కడికక్కడే మతి చెందాడు. గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తేజావత్ మల్సుర్ (55) తన వ్యవసాయ పొలం వద్ద పనుల్లో నిమగమై ఉండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం రావడంతో పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. ఒక్కసారిగా పిడుగుపాటు గురికాగా మల్సుర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు.. పరిశీలించగా మృతి చెంది ఉన్నట్టు గుర్తించారు.