Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గట్టుప్పల్ శివారులో రూ.19లక్షలు పట్టివేత
- ఉప ఎన్నిక నేపథ్యంలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు డబ్బు సంచులను దించే ప్రయత్నంలో ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే నాయకుల కొనుగోళ్లను పూర్తి చేయగా.. ఇక ఓటర్లను ప్రలోబపెట్టేం దుకు యత్నిస్తున్నారు. రెండ్రోజుల కిందట బీజేపీకి చెందిన నాయకుల డబ్బు రూ.కోటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గట్టుప్పల్ మండల కేంద్రం నుంచి పుట్టపాకకు వెళ్లేదారిలో పోలీ సులు వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో బీజ్రా కారులో తరలిస్తున్న రూ.19లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. అయితే, ఆ కారులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ లభ్యమైనట్టు అధికారులు చెప్పారు.