Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యతా ప్రమాణాల విభాగాల్లో మూడు సర్టిఫికెట్లు
- వీసీ సీతారామారావుకు శివయ్య అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉన్నత విద్యా రంగంలో నాణ్యమైన సేవలు అందుంచి నందుకు, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాల యనికి ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో గుర్తింపు లభించింది. ఎనర్జీ స్టాండర్డ్స్ విభాగంలో ఐఎస్వో-50001: 2018, పర్యావరణ, గ్రీన్ ఆడిట్‌కు ఐఎస్వో 14001:2015, ఉన్నత విద్యా సేవలను నాణ్యంగా అందిస్తున్న ందుకు మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ విభాగంలో ఐఎస్వో 9001:2015 మూడు సర్టిఫికేట్లు వచ్చాయి. ఆ వర్సిటీ వీసీ సీతా రామారావుకు హెచ్‌వైఎం ఇంటర్నేష నల్ సర్టిఫికేషన్స్ అధినేత ఆలపాటి శివయ్య మంగళవారం హైదరాబాద్ లో అందజేశారు. సర్టిఫికేషన్ బృందం విశ్వవిద్యాలయంలో పర్యటించి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకు న్నది. వాటిలో అకడమిక్, అడ్మినిస్ట్రే టివ్, ఆడిట్, పర్యావరణ, గ్రీన్ ఆడిట్, మేనేజ్మెంట్ అంశాలను అధ్యయనం చేసింది. విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్టిఫికెట్లను అందిం చామని శివయ్య అన్నారు. 1982లో దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా స్థాపించబడిందని వీసీ సీతారామారావు చెప్పారు. నాణ్యతా, విద్యార్థులకు సేవలను అందించడంలో ముందుంటామనీ, రానున్న రోజుల్లో ఉద్యోగులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, సీఎస్టీడీ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ఎవిఎన్‌రెడ్డి, సికా డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, ఇంజినీర్ లక్ష్మీప్రసాద్తో పాటు అన్ని విభాగాల అధిపతులు, డీన్లు, అన్ని ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.