Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్కేజీ బాలికపై డ్రైవర్ లైంగికదాడి?
- పోక్సోచట్టం కింద కేసు నమోదు
నవతెలంగాణ- బంజారాహిల్స్
ఎల్కేజీ చదువుతున్న ఓ చిన్నారిపై ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ దుర్మార్గానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌రోడ్ నెంబర్ 14లోని బిఎస్డి, డిఏవి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజినీకుమార్ రోజూ ఎల్కేజీ చిన్నారుల డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి వెళ్తున్నాడు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిన్నాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఓ చిన్నారి తట్టుకోలేక చివరకు తల్లిదండ్రులకు చెప్పింది. వారె వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటన వెనుక ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, ప్రమేయం ఉందని ఆరోపించారు. నిందితుడు రజినీపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.