Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు రైతులకు కేటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోటార్లకు మీటర్లు పెడుతున్న మోడీ కావాలా..? రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ కావాలా..? అనే విషయాన్ని తేల్చుకోవాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్... మునుగోడు రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతీయేటా ఉచిత కరెంటు కోసం రూ.10,500 కోట్లను తమ ప్రభుత్వం కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు. రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకూ రూ.58 వేల కోట్లను అందించామని వివరించారు. ప్రమాదవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమాను అందిస్తున్నామని తెలిపారు. మునుగోడు రైతులతో మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సు ద్వారా ఆయన ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. అందుకే మునుగోడులో ఆలోచించి ఓటేయాలంటూ రైతులకు సూచించారు. బీజేపీ అబద్ధపు ప్రచారాల మాయాలో పడొద్దని వారికి విజ్ఞప్తి చేశారు.