Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా నిర్వహించిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ (కేఏటీ) ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల ఫౌండర్ చైర్మెన్ బిఎస్ రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒలింపియాడ్లు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిందని తెలిపారు. వారిలో శ్రీచైతన్య స్కూల్ నుంచే రికార్డు స్థాయిలో 20,504 (48.2 శాతం) మంది విద్యార్థులు రెండోదశకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. దేశంలో మరే ఇతర విద్యాసంస్థ ఈస్థాయిలో ఫలితాలను సాధించలేదని పేర్కొన్నారు. శ్రీచైతన్యకు చెందిన విద్యార్థులు మ్యాథ్స్ అసెస్మెంట్ టెస్ట్ (ఎంఏటీ)లో 8,097 (49 శాతం), ఫిజిక్స్ అసెస్మెంట్ టెస్ట్ (పీఏటీ)లో 5,518 (46.8 శాతం), కెమిస్ట్రీ అసెస్మెంట్ టెస్ట్ (సీహెచ్ఏటీ)లో 6,889 (48.8 శాతం) మంది రెండోదశకు అర్హత సాధించారని వివరించారు. కేఏటీ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విజయపతాకం ఎగురుతున్నదని తెలిపారు. ప్రత్యేక అకడమిక్ ప్రోగ్రామ్‌లు, అంకితభావంతో పనిచేసే అధ్యాపకుల వల్ల ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సీమ అభినందనలు తెలిపారు.