Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాహుల్‌గాంధీ భారత్‌జోడో పాదయాత్ర నిర్వహణకు 13 రకాల కమిటీలను ఏర్పాటుచేసినట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అనుమతితో మంగళవారం ఈ కమిటీలను ఆయన ప్రకటించారు. ఈ నెల 23 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర సాగుతుంది. కల్చరల్ కమిటీ చైర్మెన్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కన్వీనర్‌గా అంజన్ కుమార్ యాదవ్ నియమితు లయ్యారు. సామాజిక ఉద్యమకారులతో భేటీ బాధ్యతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కిగౌడ్ నిర్వహిస్తారు. పబ్లిసిటీ కమిటీ చైర్మెన్ గా దామోదర్ రాజనర్సింహ, కన్వీనర్‌గా కుంభం అనిల్‌కుమార్, మదన్ మోహన్, పాదయాత్ర సమన్వయకర్తల చైర్మెన్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కన్వీనర్‌గా మల్లు రవి వ్యవహరిస్తారు. అలాగే 41 మందితో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ కమిటీ చైర్మెన్‌గా మాజీమంత్రి వినోద్, కన్వీనర్ గా హర్కర వేణుగోపాల్, కో కన్వీనర్‌గా జగదీశ్వరరావును నియమించారు. పాదయాత్రలో కార్నర్ మీటింగ్ కమిటీకి చైర్మెన్ సంపత్ కుమార్, కన్వీనర్లుగా అజ్మతుల్లా హుస్సేన్ వినోద్ రెడ్డి వ్యవహరిస్తారు. ఫుడ్ కమిటీ చైర్మెన్‌గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కన్వీనర్‌గా రాజ్ ఠాకూర్, జన సమీకరణ కమిటీ చైర్మెన్‌గా మహేశ్వర్ రెడ్డి, కన్వీనర్‌గా గంగారాం వ్యవహరిస్తారు. మీడియా కమిటీ చైర్మెన్‌గా జెట్టి కుసుమ కుమార్, కన్వీనర్‌గా అయోధ్య రెడ్డి, మహిళా జన సమీకరణ కమిటీకి ఎమ్మెల్యే సీతక్క చైర్మెన్, కన్వీనర్‌గా పద్మావతి రెడ్డిని నియమించారు. పాదయాత్రలో పాల్గొనే సభ్యుల సమన్వయ బాధ్యతలను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సురేష్ షెత్కర్లకు అప్పగించారు. మౌలిక సదుపాయాల కమిటీ చైర్మెన్‌గా రామ్మోహన్ రెడ్డి, కన్వీనర్‌గా దొంతి మాధవరెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా గడ్డం ప్రసాద్ కుమార్, కన్వీనర్‌గా మన్నే సతీష్‌ను నియమించారు.