Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.16వేల మందికి పోలీస్ రిక్రూట్ మెంట్ కానిస్టేబుల్ పరీక్షల్లో కటాఫ్ మార్కులు ప్రకటించారనీ, కానీ 15 వేల మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించలేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇటీవలి శాసనసభ సమావేశాల్లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రస్తావించారని గుర్తుచేశారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో ఆ పరీక్షల రిజల్స్ట్ రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, హౌం మంత్రివెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నాననీ, స్పందించకుంటే ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తానని హెచ్చరించారు.