Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల విద్యా సంస్థల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తుర్కపల్లిలో బుధవారం ప్రారంభిం చారు. ఈ పోటీలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగు తాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు, డిప్యూటీ కార్యదర్శి తిరుపతి, విజిలెన్స్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి, జిల్లా ఆర్సీవోలు శ్రీనివాస్ రెడ్డి, యాదయ్యగౌడ్, లింగయ్య, ఏజీవోలు చంద్రశేఖర్, మాణిక్యప్ప, కరుణాకర్, పాఠశాల ప్రిన్సిపాల్ యం.ఉషారాణి, స్వప్న పాల్గొన్నారు