Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసులో ప్రముఖ బంగారు నగల వ్యాపారీ, ముసద్దిలాల్ జ్యువెలర్ ఎండీ సుకేష్ గుప్తాకు ఈడీ ప్రత్యేక కోర్టు 14రోజుల పాటు రిమాండ్‌ను విధించింది. గత రెండ్రోజులుగా ముసద్దిలాల్ జ్యువెలర్స్ షోరూంలలో సోదాలను నిర్వహించిన ఈడీ అధికారులు దాదాపు వందకోట్ల రూపాయలకుపైగా విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనపర్చుకున్నారు. అనంతరం తమ నుంచి తప్పించుకుని తిరుగుతున్న సుకేష్ గుప్తాను ఎట్టకేలకు అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. గతంలో ఎంఎంటీసీ నుంచి రూ. 503కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను సేకరించిన ముసద్దిలాల్ జ్యువెలర్స్ వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనల ప్రకారం వినియోగించుకోకపోవడం, తప్పుడు లెక్కలు చూపించడంతో పాటు ఎంఎంటీసీ నుంచి తప్పుడు ధృవపత్రాలతో మోసపూరితంగా రూ. 503కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను ముసద్దిలాల్ జ్యువెలర్స్ ఖరీదు చేసినట్టు ఈడీ ఆరోపించింది. గతంలోనూ ముసద్దిలాల్ జ్యువెలర్స్‌పై ఈడీ దాడులను నిర్వహించగా.. అప్పటి నుంచి సుకేష్ గుప్తా పరారీలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ వర్గాలు వివరించాయి.