Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ సీఈవో రవికిరణ్‌కు సంతోష్‌కుమార్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌గర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను ఆన్లైన్లో ప్రారంభించాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ కోరారు. ఈ మేరకు జాయింట్ సీఈవో రవికిరణ్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ గత ఐదు రోజుల నుంచి ఆన్లైన్లో నమోదు కావడం లేదని తెలిపారు. దీంతో ఎంతో మంది అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటు నమోదు చేసుకు నేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరికి నమోదు చేసుకునేలా ఆన్లైన్ విధానానికి అవకాశమివ్వాలని కోరారు. ఐదురోజుల నుంచి ఆన్లైన్లో నమోదు కావడం లేదని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియను మరో ఐదు రోజుల పొడిగించాలని సూచించారు. దీనికి స్పందించిన జాయింట్ సీఈవో రవికిరణ్ గురువారం సాయంత్రంలోపు ఆన్లైన్లో ఓటు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని హామీ ఇచ్చారని తెలిపారు.