Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సర్కారు లేఖలు
- అనవసర జాప్యాన్ని నివారించాలని సూచన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతనిధి-హైదరాబాద్
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన కొత్తఎత్తిపోతల ప్రాజెక్టుల డీపీఆర్‌లకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి శాఖతోపాటు సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. అనవసర జాప్యాన్ని నివారించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఆరు డీపీఆర్‌లతో చనాఖా-కొరాటా, చౌటుపల్లి-హనుమంతరెడ్డి, ముక్తేశ్వర ఎత్తిపోతల(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల ప్రాజెక్టులకు టెక్నికల్ అప్రైజల్ కమిటీ(టీఏసీ) అనుమతులు రావడంలో తీవ్రం జాప్యం జరుగుతున్నదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి అత్యవసరంగా టీఏసీ అనుమతులు ఇవ్వాలని కేంద్ర జలశక్తిశాఖను కోరారు. ఈ విషయమై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు బుధవారం లేఖ రాశారు. చనాఖా-కొరాటా, చౌటుపల్లి-హన్మంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ముక్లేశ్వర్ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని వివరాలతోపాటు అంశాల ప్రాతిపదికన సవివరంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)13వ సమావేశంలో తెలంగాణ సమర్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్‌లు, వివరాలతోపాటు బోర్డు స్వయంగా చేసిన అధ్యయనం వివరాలతో కూడిన నివేదికను ఈ ఏడాది మే నెలలో కేంద్ర శాఖకు జీఆర్ఎంబీ సమర్పించిందన్నారు. అయినా సీడబ్ల్యూసీ, కేంద్ర జలశాఖ నుంచి సాంకేతి అప్రైజల్ అనుమతులు(టీఏసీ) రావడంలో మితిమీరిన ఆలస్యం జరుగుతున్నదన్నారు. ఇకనైనా స్పందించి అత్యవసరంగా చనాఖా-కొరాటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ముక్వేశ్వర్ ఎత్తిపోతల ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులు ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబరులో కేంద్ర జల శక్తి శాఖ మంత్రికి రాసిన లేఖ మేరకు ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సమర్పించిందన్నారు. డీపీఆర్లతోపాటు సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ అడిగిన వివరాలను ఇచ్చామన్నారు.