Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ పర్యాటక శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. బుధవారం జిల్లాలోని హరిత కాకతీయలో పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ, రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేయాల్సిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జకారం, దేవుని గుట్ట, బుస్సాపూర్ను కలుపుకొని సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రామప్ప దేవాలయం అభివృద్ధి నివేదిక, చేయాల్సిన పనులపై అధికారులకు సూచించారు. యునెస్కో అధికారు లకు పంపాల్సిన నివేదికను సిద్ధం చేస్తు న్నామన్నారు. టూరిజం, ఆర్కి యాలజీ, రామప్ప అభివృద్ధి కమిటీ ఉమ్మడి సహ కారంతో డోజర్ని పంపి స్తామన్నారు. ఇన్టాక్ కన్వీనర్ పాండురంగారావు మాట్లాడుతూ.. రామప్ప పరిసరాల అభివృద్ధి నివేదిక నవంబర్ 15 కల్లా అంది స్తామని తెలిపారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొ రేషన్ ఎండీ మనోహర్ రావు, టూరిజం అధికారి శశిధర్, కుడా టౌన్ ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్కియాలజీ అధికారులు రాములు నాయక్, నాగరాజు, కన్సల్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.