Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ప్రభుత్వాల పాలనలోనే మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదు : మంత్రి తన్నీరు హరీశ్ రావు
నవతెలంగాణ- మర్రిగూడ
మర్రిగూడ మండలాన్ని అభివృద్ధిలో మరో గజ్వేల్‌ను చేస్తానని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా మర్రిగూడ మండల కేంద్రంలోని రాజాపేట తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధికి నోచుకోక పోవడానికి గత ప్రభుత్వాల పనితీరే ప్రధాన కారణమన్నారు. టీిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎనిమిదేండ్లలో మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. శివన్న గూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి , రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణనేనని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి పల్లె ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోకుండా ప్రజలు ఆలోచన చేసి టీిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య, రాజపేట తండ గ్రామ శాఖ అధ్యక్షులు టీిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.