Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీ ఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజ్ లీగ్ చాంపియన్‌షిప్ అండర్ 19 మ్యాచ్‌లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ.. వరంగల్ టీమ్‌పై విజయం సాధించింది. వీటిలో మూడు మ్యాచ్‌లు నిర్వహించారు. రెండు మ్యాచ్‌లలో అంబేద్కర్ కాలేజీ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ పవన్‌కుమార్ శర్మ (35 పరుగులు, మూడు వికెట్లు), శీతల ఆశీశ్ వర్ధన్ (మూడు వికెట్లు), హర్షిత్ (29 పరుగులు,1 వికెట్)తో రాణించి టీమ్‌ను విజయ తీరాలకు చేర్చారు. వీరికి ఫిజికల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్, కోచ్‌లు అభినందనలు తెలిపారు.