Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడులో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గొల్ల కురుమలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్... గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయటం వల్ల మునుగోడు నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ ప్రస్తుతం ఆగిపోయిందని చెప్పారు. ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ఆ పథకాన్ని అక్కడ తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అందువల్ల గొల్ల కురుమలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులతో కలిసి తలసాని మాట్లాడారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన డబ్బులు రాకుండా కాంగ్రెస్, బీజేపీ అడ్డుకున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చిల్లర రాజకీ యాలు పనికి రావని హితవు పలికారు. ఎన్నో రోజులు ఆ పథకాన్ని ఆప లేరని అన్నారు. నవంబరు ఆరు తర్వాత అది యధావిధిగా కొనసాగు తుందని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీని కూడా త్వరలోనే ప్రారంభి స్తామని మంత్రి ఈ సందర్భంగా హామీనిచ్చారు.