Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన మధ్యతరగతి విద్యార్థులపై ఫీజు పిడుగు పడింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అందుకనుగుణంగా 159 ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం (జీవో నెంబర్ 37) ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలో 40 ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.లక్ష ఆపైన ఫీజులను ప్రభుత్వం పెంచింది. ఈసారి అత్యధిక ఫీజు రూ.1.34 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. గతంలో సీబీఐటీలో అత్యధిక ఫీజు రూ.1.34 లక్షలున్నది. ఈసారి ఎంజీఐటీలో అత్యధిక ఫీజు రూ.1.08 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. ఆ కాలేజీలో ఏకంగా రూ.52 వేలు ఫీజు పెరగడం గమనార్హం. సీవీఆర్లో రూ. 1.50 లక్షలు, సీబీఐటీ, వాసవి, వర్ధమాన్ కాలేజీల కు రూ.1.40 లక్షల ఫీజు ఖరారైంది. అత్యల్ప ఫీజు మాత్రం రూ.35 వేల నుంచి రూ.45 వేలకు ప్రభు త్వం పెంచింది. రూ.45 వేల ఫీజున్న కాలేజీలు తొ మ్మిది ఉన్నాయి. ఈ ఫీజులు 2019-20, 2020- 21, 2021-22 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియెడ్ కు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత కరువు
ఇంజినీరింగ్ బీటెక్ ఫీజులను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెం దుతున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యి ంది. మూడో విడత కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్లో పది వేలలోపు ర్యా ంకు సాధించిన అభ్యర్థులందరికీ పూర్తి ఫీజు రీయిం బర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించేది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థు లకు సైతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుం ది. అయితే గతంలో కనీస ఫీజు రూ.35 వేలు ప్రభు త్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఈసారి కనీస ఫీజు రూ.45 వేలకు ప్రభుత్వం పెంచింది. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం రూ.45 వేలకు పెంచు తున్నట్టు ప్రకటించలేదు. దీంతో ఇంజినీరింగ్ ప్రవేశా ల్లో చేరుతున్న అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు.
ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఫీజు ఖరారు
ఇంజినీరింగ్ పీజీకి సంబంధించిన ఎంటెక్తో పాటు ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవా రం ఎంటెక్ ఫీజులకు సంబంధించి జీవో నెంబర్ 38, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఫీజులకు సంబంధిం చి జీవో నెంబర్ 39ని విడుదల చేశారు. 76 ఎంటెక్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేశామని తెలిపారు. ఇందులో సీబీఐటీలో అత్యధిక ఫీజు రూ. 1,51,600 ఉందనీ, ఇతర కాలేజీల్లో అత్య ల్ప ఫీజు రూ.57 వేలు ఉందని పేర్కొన్నారు. 239 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఫీజులను ఖరారు చేశామని వివ రించారు. బివి భవన్స్ వివేకా నంద కాలేజీ లో అత్య ధిక ఫీజు రూ.1,10 లక్షలు, ఇతర కాలేజీల్లో కనీస ఫీజు రూ.27 వేలు ఖరారు చేశామని తెలిపారు.