Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే 26 నుంచి మిడ్ డే మీల్స్ నిలిపేస్తాం
- మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సుమారు రూ.3 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వెంటనే ప్రభుత్వం చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. గురువారం డీఈవో కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రెండు నెలల నుంచి బిల్లులు మంజూరు చేయాలని చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికుల్లో పేదవాళ్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో దీపావళి తర్వాత 26వ తేదీ నుంచి హైస్కూల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా వ్యాప్తంగా వంట బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.