Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ముదిగొండ
కమ్యూనిస్టు పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసంతో నమ్ముకున్న సిద్ధాంతంతో కడవరకు నడిచిన ఆదర్శ కమ్యూనిస్టు నేత పయ్యావుల పూర్ణచంద్రరావు (పుల్లయ్య) అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ కార్యకర్త పయ్యావుల పూర్ణచందర్రావు సంతాప సభను పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని పాల్గొని మాట్లాడారు. పూర్ణచంద్రరావు అకాల మృతి పార్టీకి, కుటుంబానికి తీవ్ర నష్టదాయకమన్నారు. గ్రామంలో అజాతశత్రువుగా ఎదిగి ప్రజలకు ఎంతోయ సేవ చేశారని తెలిపారు. రాజకీయాలు డబ్బు, పదవులతో నడుస్తున్నాయన్నారు. సమాజ భవిష్యత్తుకు సరైన మార్గం చూపించగలిగే సత్తా ఎర్రజెండాకే ఉందన్నారు. ఓట్లు, సీట్లు లెక్కచేసే సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం కాదన్నారు. మతోన్మాద శక్తుల ప్రభావం ముంచుకొస్తుందని, దాన్ని తుది ముట్టించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పయ్యావుల పూర్ణచంద్రరావు అకాల దుర్మరణం బాధాకరమన్నారు. గోకినేపల్లిలో ప్రజల ఆదరణ పొందిన పూర్ణచంద్రరావు తుదికంట ఎర్రజెండాను వీడలేదన్నారు. ఉద్యమాల గడ్డ గోకినేపల్లి అమరుల వారసుడిగా పూర్ణచంద్రరావు నిలిచారన్నారు. సభలో.. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్ ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు కట్ట రమాదేవి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, పార్టీ రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ, సీనియర్ నాయకులు సుబ్బారావు, నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మచ్చా లక్ష్మి, బండి పద్మ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు అందే సత్యం, పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.