Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లెల్లో వానర మూకల ఆగడాలను తట్టుకోలేక. ప్రజలు అనుసరిస్తున్న వినుత మార్గాలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని కోతుల బెడద ఎక్కువయింది. ఇంట్లోకి గుంపులు గుంపులుగా ప్రవేశించి వస్తువును పాడు చేయడం. ఇల్లు పీకి పందిరి వేస్తుండడంతో వస్తువులు ఆహారం పదార్థాలను కాపాడుకునేందుకు ప్రజలు అనేక తంటాలు పడుతున్నారు. మండలంలోని మర్యాల గ్రామానికి చెందిన దేశెట్టి లక్ష్మీనారాయణ ఇంటిపైన టీవీ డిటిహెచ్ (డిష్) ను కోతులు పీకేశాయి. ప్రతిసారి ఇలా పీకేయడం రిపేరు చేయడం సాగుతుంది. ఇలా కాదని చివరికి డిష్ ను ముట్టుకుంటే గుచ్చుకునేలా చిన్నపాటి ఇనుప మేకులను గమ్ తో అంటించారు. ఇప్పుడు సిగల్స్ బాగానే రావడంతో ఆ కుటుంబ సభ్యులు కోతుల బెడద తగ్గిందని సంతోషం వ్యక్తం చేశారు...
నవ తెలంగాణ విలేకరి కెమెరాకు చిక్కిన దృశ్యం...
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం