Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన ఆర్వోగా రోహిత్ సింగ్
నవతెలంగాణ-చండూరు
మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును సీఈసీ తొలగించింది. మునుగోడు ఉప ఎన్నికల నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రోహిత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంపై ఆర్వో జగన్నాథరావును విధుల నుంచి ఎన్నికల కమిషన్ తొలగించింది. మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్రులకు గుర్తుల కేటాయింపులో గంద రగోళంపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది.