Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్దాల కోరు
- ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరంగా ఈడీ,సీబీఐ :విలేకర్ల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఫాసిజాన్ని అమలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఎన్ బాలమల్లేశ్, ఈ.టీ. నర్సింహాతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కేంద్రంలోని పెద్దలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారిని నెత్తిన పెట్టుకుంటున్నారనీ, వ్యతిరేకించే వారిపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాద కరంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. నాటి వాజ్‌పేరు ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని చెప్పారు. విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహా సభలు అత్యంత ఉత్సాహ పూరితంగా జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా.. అవి జయప్రధమయ్యాయని చెప్పారు. 17దేశాలనుంచి సౌహార్థప్రతినిధులు హాజరై ఆయా దేశాల్లో ఉన్న ఉద్యమ పరిస్థితులను వివరించారన్నారు. రూపాయి విలువ అత్యంత అధమ స్థాయికి పడిపోతున్నప్పటికీ..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పచ్చి అబద్దాలు చెబుతున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబంగా మంత్రి మాట్లాడుతున్నదని తెలిపారు. మునుగోడుతో పాటు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించాలన్నారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ సంస్థలే అసలైన తీవ్రవాద సంస్థలని విమర్శించారు. మహిళల పై లైంగిక దాడికి పాల్పడిన వారికి సన్మానాలు చేయటం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ సంస్థలకు రూ. తొమ్మిది లక్షల కోట్లు రాయితీలిచ్చిన బీజేపీ పెద్దలు.. ఉచితాలు అనుచితమని వ్యాఖ్యా నించటం విడ్డూరంగా ఉందన్నా రు. అజీజ్ పాషా మాట్లాడుతూ మహాత్మాగాంధీ మాటల ను అనుసరిస్తే.. చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటూ భారత పర్యటన లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ వ్యాఖ్యా నించారని గుర్తు చేశారు. ఇటీవల మోడీ ని పొగిడిన వ్యక్తికి మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు.చాడ మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం ఉద్యమాలు చేపడతామని చెప్పారు.