Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోజ్ గార్ మేళాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగం గా కొత్తగా నియమింపబడే 75,000 మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలను అందించనున్నారు. మొత్తం 10 మంది లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలను 38 మంత్రిత్వ శాఖలు యుపిఎస్సి, ఎస్ఎస్సి , రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు, తదితర నియామక సంస్థల ద్వారా మిషన్ మోడ్ విధానంలో చేపట్టడం జరిగింది.