Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 - 2025 సంవత్సరాలకు గానూ గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్(ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించింది. ఈ అవార్డును ''ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్'' ప్రదానం చేస్తున్నది. ఈ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని తెలిపారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను 'ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్' ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా లక్ష్మీనర్సింహ్మ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించారు.