Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ కేసులో కౌంటర్ దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చివరి అవకాశమనీ, ఈనెల 28న జరిగే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేకపోతే తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీనిపై రాజాసింగ్ భార్య ఉషాభారు దాఖలు చేసిన రిట్‌ను గురువారం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక జీపీ ముజీబ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. దాదాపు 100 కేసుల్లో రాజాసింగ్ నిందుతుడిగా ఉన్నారన్నారు. కౌంటర్ అఫిడవిట్ 1650 పేజలు ఉందనీ, కౌంటర్ వేసేందుకు రెండు వారాల సమయం కావాలని కోరారు. ఒక్క వారమే గడువు ఇస్తున్నట్టు హైకోర్టు తేల్చి చెప్పింది.
పాటిల్ ఎన్నికపై కేసు విచారణ వాయిదా
జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికలను రద్దు చేయాలని దాఖలైన కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. జార్ఖండ్ లేబర్ కోర్టులోని కేసు గురించి ఈసీకి చెప్పలేదనీ, కాబట్టి పాటిల్ ఎన్నికను రద్దు చేయాలని 2019 ఎన్నికల్లో ఆయనపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు వేసిన రిట్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం విచారించారు.