Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉదయం నిర్వహించాల్సిన పరీక్షను మధ్యాహ్నం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. ఈ సంఘటనపై స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.