Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2016 లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ట్వీట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. 2016లో నల్లగొండ జిల్లా మర్రిగూడలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో పర్యటించిన నడ్డా.. ఫ్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామంటూ హామీనిచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ ఇచ్చి ఆరేండ్లయింది. అయితే ఆ సెంటర్ ఏర్పాటుకోసం 8.2 ఎకరాల స్థలాన్ని చౌటుప్పల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇప్పటికీ కేంద్రం ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదు. మర్రిగూడలో 300 పడకల ఆస్పత్రి నిర్మిసామని కూడా నడ్డా హామీ ఇచ్చారు. ఇలా అబద్దపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతలు ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారు? ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పడం ఖాయమంటూ గురువారం ట్విటర్ వేదికగా విమర్శించారు.